calender_icon.png 28 November, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరిక

28-11-2025 12:00:00 AM

వనపర్తి టౌన్, నవంబర్ 27 : వనపర్తి నియోజకవర్గం పరిధి ఖిల్లా ఘనపురం మండలం మానాజీపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెట్టి యాదయ్య, బండారి శ్రీశైలం, ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్బంగా నాయకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి మాజీ మంత్రి సాధారంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమములో మాజీ ఎం.పి.టి. సి నాగయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు కుమ్మరి శివకుమార్, నాయకులు చుక్కన్న, రాజ్ కుమార్, బుచన్న తదితరులు ఉన్నారు.