calender_icon.png 28 November, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్యవివాహాలతో జీవితం అగమ్యగోచరం

28-11-2025 12:00:00 AM

సమావేశంలో డీడబ్ల్యూవో జరీనా బేగం 

మహబూబ్ నగర్, నవంబర్ 27(విజయక్రాంతి): బాల్య వివాహాలతో జీవితం అగమ్య గోచరంగా మారుతుందని బి డబ్ల్యువో జరీనా బేగం అన్నారు. గురువారం మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ,  రూరల్ డెవలప్మెంట్  సొసైటీ   భాగస్వామ్యం తో కేజీబీవీ లో బాల్య వివాహాలు చేసుకోకూడదు అనే అంశంపై నిర్వహించారు.  ఈ సందర్బంగా   చిన్నారులకు వ్యాస రచన, చిత్రలేఖనం పొటీ నిర్వహించిగ , విద్యార్థులు ఉత్సాహంగా  పాల్గొన్నారు, రూరల్ డెవలప్మెంట్  సొసైటీ మహబూబ్ నగర్ జిల్లా కోఆర్డినేటర్, విశ్వకాంత్ విజేతలకు నగదు బహుమతులు, ప్రశంస పత్రాలను ప్రధానం చేశారు.

ఈ  సందర్భంగా ఆమె జరీనా బేగం  మాట్లాడుతూ బాల్య వివాహలను చేసుకోవడం వలన జరిగే  అనర్థాలను గురించి, తల్లితండ్రులను గౌరవించాలని, బాలికలు చదువు పట్ల శ్రద్ధ చూపాలని ,  లక్ష్యం ఏర్పరచుకొని, బాధ్యత గా  ముందుకు సాగాలని తెలిపారు. చిన్న వయస్సు లో పెళ్లి చేసుకోవద్దని పిలుపునిచారు. సోషల్ మీడియా లో  వ్యక్తి గత వివరాలు ఇతరులతో  పంచుకోవద్దు హెచ్చరించారు.

అనంతరం జిల్లా వైద్య అధికారి కృష్ణా  మాట్లాడుతూ చిన్న వయసులో జరిగే వివాహాలు బాలికల శారీరక , మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు, కౌమార దశలో గర్భ ధారణ సమయంలో ప్రాణాలకు ముప్పు ఉందని,  అవయవాల ఎదుగు దళ లో వచ్చే మార్పుల గురించి, ఆకర్షణకు లోను కాకూడదన్నారు. బుక్స్ తోపాటు సొసైటీ మీద కూడా అవగాహన పెంచుకోవాలని తెలిపారు. గుడిలో, మసీదులో , చర్చ లో బాల్య  వివాహాలను నిర్మూలనకు అవగాహన కోసం పోస్టర్స్ రిలీజ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.