04-09-2025 09:35:01 PM
మేడిపల్లి: పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి ఇంటి నుండి వెళ్లి అదృశ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బోడుప్పల్ మున్సిపల్ హేమనగర్ కి చెందిన బండ్ల ప్రవీణ్ తన తల్లిదండ్రులతో నివాసం ఉంటున్నాడు. తన తండ్రి అయిన బిక్షపతి(51) కొన్ని నెలల నుండి పక్షవాతంతో బాధపడుతూ సరిగ్గా నడవలేడు, మాట్లాడలేడు. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటి నుండి బయటకి వెళ్లిన తన తండ్రి మళ్లీ తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా సమాచారం లభించకపోవడంతో మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇట్టి వ్యక్తి గురించి సమాచారం లభిస్తే మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వగలరని సిఐ గోవిందరెడ్డి తెలిపారు.