calender_icon.png 7 September, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా ఇవ్వండి మహాప్రభో..

04-09-2025 09:30:58 PM

రేగొండ (విజయక్రాంతి): యూరియా ఇవ్వండి మహాప్రభో అంటూ రైతన్నలు గగ్గోలు పెడుతున్న పాలకులు కనికరించడం లేదంటూ మండల రైతులు వాపోతున్నారు. వ్యవసాయ పనులు మాని సహకార సంఘం వద్ద రోజు బారులు తీరి నిలుచున్న నాయకుల కళ్ళకు రైతుల గోస కానరావడం లేదని మండిపడుతున్నారు. గురువారం ఉదయం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాసారు. యూరియా కొరత నివారణకు కనీస చర్యలు తీసుకోకుండా రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్ లో గంటల తరబడి నిల్చుంటే అదృష్టం బావుండి బస్తా దొరికితే అదే పది వేలంటూ అనుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు తగిన యూరియా నిల్వలను అందించాలని రైతులు వేడుకుంటున్నారు.