19-09-2025 01:07:34 AM
-వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓటమి
-చేజారిన ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్
-ఏడేండ్ల తర్వాత పతకం లేకుండా ట్రోఫీని ముగించిన నీరజ్
-తృటిలో పతకం చేజార్చుకున్న సచిన్ యాదవ్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: టోక్యో వేదికగా గురువారం జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నిరాశపర్చాడు. పతకమే లక్ష్యంగా ఫైనల్‌లో అడుగుపెట్టిన చోప్రా పతకానికి ఆమడ దూరంలో నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఏడేండ్ల అనంతరం నీరజ్‌చోప్రా పతకం లేకుండా ఓ ఈవెంట్‌ను ముగించడం గమనార్హం. ట్రినిడాడ్ అండ్ టుబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్ (88.16 మీటర్లు) స్వర్ణం గెలవగా, గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ (87.38 మీటర్లు) రజతం, అమెరికాకు చెందిన థాంప్సన్ (86.67 మీటర్లు) కాంస్యం గెలుచుకున్నాడు. నీరజ్ చోప్రా ఎనిమిదో స్థానంలో నిలిచి భారతీయుల ఆశలపై నీళ్లు చల్లాడు.
పాపం సచిన్ యాదవ్
నీరజ్ చోప్రా వల్ల మరుగునపడిపోయిన సచిన్ యాదవ్ తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నా డు. కేవలం 40 సెంటీమీటర్ల దూ రం జావెలిన్ తక్కువగా విసరడంతో థాంప్సన్‌కు కాంస్యం దక్కిం ది. సచిన్ 86.27 మీటర్ల దూరంతో నిలిచాడు. ఇక పారిస్ ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత, పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ కూడా తేలిపోయా డు. రెండు ఫౌల్స్ చేసిన నదీమ్ పదో స్థానంలో నిలిచాడు.