calender_icon.png 31 January, 2026 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశ్రుతి

04-10-2024 12:36:05 AM

వేదిక కుప్పకూలి ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలు

సినీ నటి ప్రియాంకకు తప్పిన ప్రమాదం

జనగామ, అక్టోబర్ 3 (విజయక్రాంతి): ఓ షాపింగ్ మాల్ ప్రారం భోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. అభిమానుల కోలాహలం మధ్య అతిథులు వేదికపైకి ఎక్కగా ఒక్కసారిగా స్టేజీ కుప్పకూలింది. ఈ ఘటనలో కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

అదే స్టేజీపై ఉన్న సినీ నటి ప్రియాంక మోహన్ సురక్షితంగా బయటపడ్డారు. మహబూబా బాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో కొత్తగా ఓ షాపింగ్ మాల్‌ను ఏర్పా టు చేశారు. గురువారం మాల్ ను ప్రారంభించేందుకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డితో పాటు సినీ నటి ప్రియాంక హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్ ఎదుట వేదిక ఏర్పాటు చేశారు.

ఆ వేదికపై ఝాన్సీరెడ్డి, ప్రియాంక ఎక్కి అభిమానులకు అభివాదం చేస్తున్నారు. ప్రారంభోత్సవానికి వందలా ది మంది ప్రజలు తరలివచ్చారు. ముఖ్య అతిథులు స్టేజీపైకి ఎక్కి అందరికీ అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది.

ఆ సమయంలో స్టేజీపై సుమారు 30 మంది ఉన్నారు. ఉన్నట్టుండి అది కూలిపోవడంతో ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను పోలీసులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సినీ నటి ప్రియాంకకు పెద్దగా గాయాలేమీ కాకపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు.