31-01-2026 05:58:52 PM
మేడ్చల్ సిఐ ఎ.సత్యనారాయణ
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): రానున్న మునిసిపల్ ఎన్నికలలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని మేడ్చల్ సిఐ ఎ.సత్యనారాయణ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికలలో వ్యక్తిగత వాట్సాప్ గ్రూప్ లలో ఎవరినైనా కించపరిచే విధంగా వాట్సాప్ లతో పాటు పోస్టింగులు చేయకూడదని ఇతర రాజకీయ పార్టీలపై కూడా ఎలాంటి కించపరిచే వాట్సాప్ లుగాని,పోస్టింగ్ లు కానీ ఎన్నికల నిబంధనను ఉల్లంఘించకూడదని ఆయన చెప్పారు.మున్సిపల్ ఎన్నికలలో ఎన్నికల కోడ్ ను అందరూ పాటించాలని పోలీసులకు సహకరించాలని కోరుతున్నట్లు సిఐ సత్యనారాయణ వెల్లడించారు.