calender_icon.png 30 May, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాధ పిల్లలకు బెడ్స్ పంపిణీ

28-05-2025 04:28:20 PM

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): పట్టణంలోని పానగల్ ఉన్న చారుమతి చైల్డ్ కేర్ ఆశ్రమంలో అనాధ పిల్లలకు బుధవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(Indian Medical Association) నీలగిరి బ్రాంచ్ ఆధ్వర్యంలో 15 బెడ్స్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ... ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్  ఎప్పటికప్పుడు ఆశ్రమం పిల్లల బాగోగులను తెలుసుకుంటూ వారికి కావలసిన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఐఎంఏ డాక్టర్ ఏ.వి. శ్రీనివాసరావు, నీలగిరి బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ దామర యాదయ్య, నరేష్, శ్రీలత, చారిమతి కేర్ సిబ్బంది పాల్గొన్నారు.