28-05-2025 04:34:38 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన కాంపల్లి రాజంను మాదిగ హక్కుల దండోరా(Madiga Hakkula Dandora) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ అన్న మాదిగ ప్రకటించారు. నియామక కాపీని ఎంహెచ్డీ అధ్యక్షుడు సునీల్ మాదిగ చేతుల మీదుగా కాంపల్లి రాజం మాదిగ అందుకున్నారు.
బెల్లంపల్లి తొలి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కాంపెల్లి రాజం మాదిగను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడం పట్ల పలువురు ఎంహెచ్డి శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి బాధ్యతలను అప్పగించినందుకూ కాంపల్లి రాజం మాదిగ ఎమ్హెచ్డి రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కాంపల్లి రాజంమాదిగ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ దృక్పథంతో మాదిగ హక్కుల కోసం నిరంతరం పోరాడతానని వెల్లడించారు.