28-05-2025 03:17:58 PM
బాలల చదువు భవతికి వెలుగు అని నినాదంతో ముందుకు పోదాం
ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరిన
బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్ర బోస్ నేత
మంథని,(విజయక్రాంతి): బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని, బాలల చదువు భవతి కి వెలుగు అని నినాదంతో ముందుకు పోదామని, పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్ర బోస్ నేత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య నా హక్కు బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం అనే నినాదంతో ముందుకు పోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశం అభివృద్ధి చెందాలంటే నేటి బాలలే భావిభారత పౌరులుగా తయారు కావాలని నేటి విద్యార్థులే నవనిర్మాణ వ్యక్తులుగా తయారు. కావాలని ఆయన అన్నారు. బాలలు పనులు చేయకండి పలక బలపం పట్టేయండి అని తల్లిదండ్రులను కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ రూపుమాపేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. బాలల హక్కులను కాల రాయవద్దని, బాలలకు స్వచ్ఛ గా ఉండే వాతావరణాన్ని కల్పించాలని, ప్రతి చిన్న విషయంలో పిల్లలను మందలించవద్దని, బాలలు బడిలో ఉండాలని పనిలో ఉంటే నేరమన్నారు. ఇటికబట్టిలు కారికానాల్లో హోటల్లో బాల కార్మికులచే పని చేయించుకుంటే కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు టోల్ ఫ్రీ నెంబర్ 1098కు సమాచార అందించాలని, బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా మనమంతా కృషి చేద్దాం అని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తల్లిదండ్రులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
భావితరం బాలల ప్రగతి కోసం పునాదులు వేద్దామని , బాల కార్మిక చట్టాలు పకడిబందిగా అమలు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు బాల కార్మిక లేని వ్యవస్థను నిర్మూలిద్దామని పేర్కొన్నారు. పిల్లలు దేశ సంపదని నేటి బాలలే భావి భారత పౌరులు వారు అన్నారు. బాల కార్మికులు గుర్తించి బడిలో చేర్పిద్దాం విద్యాబుద్ధులు నేర్పిద్దామని, దేశానికి స్వతంత్రం సిద్ధించి అప్పటికే 77 వసంతాలు పూర్తి చేసుకున్న ఇంకా బాల కార్మిక వ్యవస్థ ఉండడం చాలా బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దపెల్లి జిల్లాలో ఇటుక బట్టీల్లో ఇతర రాష్ట్ర వచ్చిన కార్మికుల పిల్లల కోసం వర్క్ సైడ్ స్కూల్ ఇటుక బట్టి యజమానులు ఏర్పాటు చేయాలని, చిన్నారి పిల్లల ఆరోగ్యము పై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని, వర్క్ సైడ్ స్కూలు మరియు సౌకర్యం కల్పించని ఇటిక బట్టి యజమానులపై చర్య తీసుకోవాలని ఆయన అన్నారు.
ప్రభుత్వ బడులలో విద్య అభ్యసిస్తున్న చిన్నారులకు సమాజ భాగస్వామ్యంతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బడులకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తూ , ప్రభుత్వ యంత్రాగం అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వ బడులను పరిష్ఠపరిచే విధంగా విద్యా వ్యవస్థను ఒక గాడిలో తీసుకువచ్చి కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడిని అరికట్టే విధంగా విద్యా కమిషన్ ఒక చట్టం చేసే విధంగా ఉండాలన్నారు . ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ప్రైవేటు వ్యవస్థ దోపిడిని అరికట్టలేక పోవడాన్ని ప్రభుత్వంపై వలస సుభాష్ చంద్రబోస్ నేత తీవ్ర నిరసన వ్యక్తం చేశారు . తాను చదువుకున్న కాలంలో గ్రామీణ స్థాయిలో ప్రైవేటు పాఠశాలలకు కనీస సౌకర్యాలు ఉంటే తప్ప అనుమతించబడిన పరిస్థితుల్లో నేడు ప్రభుత్వం కనీస సౌకర్యాలు లేకుండా ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసే విధంగా ప్రైవేటు విద్యను ప్రోత్సహించడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే మేల్కొని ప్రభుత్వ బడుల పటిష్టతకు కృషి చేయాలని తల్లిదండ్రులు ,సమాజం వేయికళ్లతో ఎదురు చూస్తుందన్నారు .వెంటనే విద్యా కమిషన్ చర్యలను ప్రారంభించాలని ప్రతి విద్యార్థికి విద్యతో పాటు ఆటపాటలను సంస్కృతి రంగాన్ని వ్యక్తిగత వికాసం పై విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ చూపాలని విద్యా రంగం కోసం బడ్జెట్ను కేటాయించాలని వారు వేడుకున్నారు బాలల హక్కులు ప్రపంచ దేశాల తీర్మానం 1989లో నవంబర్ 20వ తేదీన ఆమోదించిందని ఆయన పేర్కొన్నారు బాలల హక్కులకు కట్టుబడి వాటికి అత్యుత్తమైన ప్రాతిన్యము ఇస్తామని ప్రపంచ దేశాలు ప్రకట కూడా జారీ చేశారు. మన దేశంలో కూడా బాలలకు తీర్మానాన్ని ఆమోదిస్తే 1992లో సంతకం చేసిందని నాటికి 192 దేశాలు బాలల హక్కులు తీర్మానం అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు.
పిల్లల హక్కుల్లో రకాలు మొత్తం 54 హక్కులను నాలుగు విధాలుగా వర్గీకరించారు. అవి జీవించే హక్కు అభివృద్ధి చెంది హక్కు రక్షణ పొందే హక్కు భాగస్వామీపు హక్కు పిల్లల హక్కులు ఎవలు కాలు రాయవద్దని, ఆయన పేర్కొన్నారు పిల్లల విద్యా హక్కును సమగ్రగా పరిరక్షించుకోవడానికి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 పకడ్బందీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అందుకు అవసరమున్న నిధులు బడ్జెట్లో కేటాయించాలని ఆయన కోరారు. పని మానేసిన బడికి వస్తున్న బాలలందరికీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయాలని లేదా అందుబాటులో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలో వీరికి ప్రవేశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని, విద్యార్థులు మంచి లక్ష్యాలు పెట్టుకుని ఉన్నతంగా ఎదగాలని, సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదగాలని పేర్కొన్నారు.
విద్యార్థి దశ నుండి స్వయం శక్తితో అభివృద్ధికి నాంది పలకాలన్నారు. విద్యార్థి దశలో సమయాన్ని వృధా చేయకుండా పుస్తక పఠనం పై దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థి దశలో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రుల కలను నిజం చేసేందుకు విద్యార్థులు దోహదపడాలని పేర్కొన్నారు. మా బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు దశాబ్దాలుగా బాలల హక్కుల కోసం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాల్య వివాహ నిర్మూల కోసం మేము కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉన్నతమైన ఆశయాల కోసం కృషిచేసే చిన్నారి విద్యార్థులకు బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ నేత శుభాకాంక్షలు తెలిపారు.