calender_icon.png 13 November, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధానీ మోదీతో కార్పోరేట్లకే లాభం..

13-11-2025 08:19:54 PM

సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి మధు..

బెల్లంపల్లి అర్బన్: నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులు కార్పొరేట్ల ప్రయోజనాలకే లాభం చేస్తోన్నదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి మధు అన్నారు. గురువారం బెల్లంపల్లి సీఐటీయు కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల కనీస హక్కులు లేకుండా కాలరాస్తున్నదని విమర్శించారు. దీంతో కార్మికుల జివన ప్రమాణాలను అడుగంటి పోతున్నాయని అన్నారు. పెట్టుబాడీదారులకు కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చాడానికి లేబర్ కోడ్స్ తెచ్చిందన్నారు. ఈ లేబర్ కోడ్స్ ను రాష్ట్రంలోని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం  కార్మికుల పని గంటలు పెంచుతు 282 జివోను తెచ్చిందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను బానిసలుగా మారుస్తుందన్నారు. కార్మికులు పోరాడి తెచ్చుకున్న హక్కుల రక్షణకై, కనీస వేతనాలు సాధనకై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై  కార్మికులు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అదే విదంగా జిల్లాలో అసంఘటిత రంగాల కార్మికులు, స్కిం వర్కర్ల, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగ, కార్మికు సమస్యలపై పోరాటాలు చేస్తామన్నారు. ఈ నెల15న తలపెట్టిన జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, వృత్తి సంఘాల రాష్ట్ర కన్వీనర్ ఆశయ్య, సిఐటియు జిల్లా మాజీ కార్యదర్శి సంకే రవి, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రమణ, రంజిత్కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్,భానుమతి రాజలింగు, జిల్లా సహాయ కార్యదర్శులు దూలం శ్రీనివాస్, సమ్మక్క, మండల కన్వీనర్ చల్లూరి దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.