13-11-2025 08:25:11 PM
వనపర్తి టౌన్: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గావాయి మీద దాడి జరిగి నేటికీ 37 రోజులు అవుతున్న దాడి చేసిన వ్యక్తి రాకేష్ కిషోర్ అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం చేయడాన్ని నిర్వహింస్తూ ఈ నెల 17న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఢిల్లీలో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన ర్యాలీ కరపత్రం ఎమ్మార్పిఎస్, మచ్చ తిరుపతి మాదిగ వనపర్తి మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల కృష్ణమాదిగ,ఎం ఈ ఎఫ్ జాతీయ ఉపధ్యక్షులు,గంధం గట్టయ్య మాదిగ పాల్గొన్న మాదిగ మాట్లాడుతూ ఈ భారత దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రక్షణ లేకుండా పోయింది దాడి జరిగి ఇన్ని రోజులు అవుతున్న ఈ వ్యవస్థలో ఉన్న పెద్దలు కనీసం అరెస్టు చేయాలని ప్రకటన చేయకుండా రాకేష్ కిషోర్ లాంటి వారికీ కొమ్ము కస్తున్నారు అని అర్ధం అవుతుంది కాబట్టి రాకేష్ కిషోర్ ని అరెస్టు చేయాలని 17న ఢిల్లీలో జరుగుతున్న దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనకు జనగామ జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి.ఈ కార్యక్రమంలో మొలకలపల్లి పరుషరాముడు మాదిగ, ఎం ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు అడ్డకుల పవన్ కళ్యాణ్ మాదిగ గోపాల్ పేట మండల కన్వీనర్, సురేష్ మాదిగ, విష్ణు మాదిగ,రాజు మాదిగ, శాంతి కుమార్ మాదిగ, వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.