calender_icon.png 12 May, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ

03-05-2025 12:00:00 AM

నేరడిగొండ, మే 2 (విజయక్రాంతి): పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చే నగదు ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.బోథ్ నియోజకవర్గ పరిధిలో ని లబ్దిదారులకు మంజూరైన  రూ. 2,42,000/- విలువ గల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను  నేరడిగొండలో ఎమ్మెల్యే పంపి ణీ చేశారు.

ఈ సందర్భంగా తలమడుగు మండలంలోని ఉండం గ్రామానికి చెందిన చోటే ఖాన్‌కి రూ.45,000, నేరడిగొండ మండలంలోని తర్నం గ్రామానికి చెందిన కామెరి రాజేశ్వర్‌కి రూ.27,000, ఇచ్చొడ మండలంలోని ఆడిగావ్ (బి)కి చెందిన సావుబాయికి రూ.60,000,  సోనాల మండల కేంద్రానికి చెందిన బొరిగేపు సుశీలకి రూ.16,500,  బోథ్ మండలంలోని దన్నూ ర్ (బి) గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డికి రూ.25,500, రవికి రూ.41,500, నల్ల రాజేశ్వర్ రెడ్డికి రూ. 16,500, ముసుకు రాజేశ్వర్ రెడ్డికి రూ.10,000 చెక్కులను ఎమ్మెల్యే  లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, యువ నాయకులు దేవేందర్ రెడ్డి, అభిరాం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, జక్క శ్రీధర్ రెడ్డి, దివాకర్ రెడ్డి, రాజు, ఉన్నారు.