calender_icon.png 9 August, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ

09-08-2025 01:26:43 AM

నిర్మల్, ఆగస్టు 8 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధిలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలోని 153 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 37,30, 500/- (ముప్పు ఏడు లక్షల ముప్పు వేల ఐదు వందల రూపాయలు) చెక్కులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి  శుక్రవారం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మండల అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే  నిర్మల్ రూరల్ మండలంలోని రత్నాపూర్ కాండి పోచంపాడు భాగ్యనగర్ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. నిర్మల్ పట్టణంలోని కాలనీలో వివిధ అభివృద్ధి పనులను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు