calender_icon.png 9 August, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్యాంకు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

09-08-2025 01:28:25 AM

కలెక్టర్ కుమార్ దీపక్

చెన్నూర్, ఆగస్టు 8: అమృత్ 2.0 పథకం లో తాగు నీటి ట్యాంకు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీలో కొనసాగుతున్న అమృత్ 2.0 నీటి ట్యాంక్ నిర్మాణ పనుల ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.

మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటి కి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీటిని అందించడం జరుగుతుందని, ఈ క్రమంలో ప్రజల కు ఎలాంటి నీటి సమస్య లేకుండా అమృత్ 2.0 పథకం ద్వారా తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద న్నారు. నీటి ట్యాంక్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికా రులను ఆదేశించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.