calender_icon.png 20 November, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్కాజిగిరిలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

20-11-2025 01:04:53 AM

మల్కాజిగిరి, నవంబర్ 19(విజయక్రాంతి) : మల్కాజిగిరి డివిజన్ రాధాకృష్ణ నగర్‌కు చెందిన జయంతి లాల్ అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ముఖ్యమం త్రి సహాయనిధికి చేసిన దరఖాస్తు మేరకు రూ.2 లక్షల ఎల్‌ఓసి మంజూరైంది. బోయిన్‌పల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ కలిసి బాధితుడికి ఎల్‌ఓసి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల వైద్య చికిత్సకు సీఎం సహాయనిధి ఆపన్న హస్తంలా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, చిన్న యాదవ్, నవీన్, మధుసూదన్ రెడ్డి, శివ గౌడ్, సుమన్ గౌడ్, సుమన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.