23-09-2025 07:36:06 PM
కొండపాక: కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంగళవారం కొండపాక మండల బిఆర్ఎస్ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్, దుద్దెడ గ్రామ మాజీ సర్పంచ్ పెద్దoకుల శ్రీనివాస్ గౌడ్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నూనె కుమార్ యాదవ్ మాట్లాడుతూ నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఐదుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.1,39,500లు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.