calender_icon.png 19 December, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాండూర్ సొసైటీ డైరెక్టర్ పదవికి రాజీనామా

18-12-2025 04:41:12 PM

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): మండలంలోని తాండూర్ కిచ్చన్నపేట సహకార సంఘం పరిధిలో గల టిసి.నెంబర్ 13 సంఘ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు జయరాజ్ తెలిపారు. ఎందుకంటే ఇటీవల జరిగిన రెండో విడత స్థానిక సంస్థ ఎన్నికల్లో వార్డు మెంబర్గా గెలిచి ధర్మరెడ్డి గ్రామ ఉప సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తాండూర్ సొసైటీ పరిధిలోని ధర్మారెడ్డి గ్రామ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు జయరాజ్ తెలిపారు.

ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డికి రాజీనామా పత్రాన్ని అందజేసి తన డైరెక్టర్ పదవి రాజీనామాను ఆమోదించాలని జయరాజు పేర్కొన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తికి రెండు పదవులు ఉండకూడదని ఉద్దేశంతో సొసైటీ డైరెక్టర్కు రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్ సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి, ధర్మారెడ్డి గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, సీఈవో మురళి, సొసైటీ సిబ్బంది సాయిలు, రాములు, తదితరులు ఉన్నారు.