calender_icon.png 19 December, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌కు ఊరట

18-12-2025 05:31:13 PM

ప్రభుత్వ విప్ : ఆది శ్రీనివాస్

వేములవాడ (విజయక్రాంతి): నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను ఢిల్లీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం హర్షణీయమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇది మోదీ–అమిత్ షా ద్వయానికి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా బీజేపీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

స్వాతంత్ర్య ఉద్యమంతో సంబంధం లేని బీజేపీ నేషనల్ హెరాల్డ్ పత్రికపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.పేదల సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని, దేవుడిని రాజకీయాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. రాహుల్, సోనియా గాంధీలపై తప్పుడు ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.