calender_icon.png 19 December, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన కారేపల్లి ఆర్ఐ!

18-12-2025 05:26:00 PM

ఖమ్మం టౌన్ (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కారేపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శుభ కామేశ్వరీ దేవి గురువారం అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ. 10 వేల నగదును లంచంగా స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు తెలిసింది. ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సివుంది.