calender_icon.png 19 December, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటింటికి తిరిగి సర్వే

18-12-2025 04:30:57 PM

డీ ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అనిత 

మంచిర్యాల, (విజయక్రాంతి): జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇంటింటికి తిరిగి సర్వే చేపడుతున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డాక్టర్ ఎస్ అనిత తెలిపారు. గురువారం మంచిర్యాల పట్టణంలోని ఆనంద నిలయం వృద్ధుల ఆశ్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ (PO) డాక్టర్ సుధాకర్ నాయక్ తో కలిసి జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కుష్టు వ్యాధి సర్వే కార్యక్రమాన్ని ఈ నెల 31 వరకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది జిల్లాలో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తున్నారన్నారు.

ముఖ్యంగా కుష్టు వ్యాధి మైకోబాక్టీరియం లెఫ్ట్ అని బ్యాక్టీరియా వల్ల వచ్చే అతి సామాన్యమైన వ్యాధి ఇది అని, చర్మానికి, నరాలకు సోకుతుందనీ, ఇది చాలా నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాలు బైర్గతం కావడానికి మూడు  నుంచి ఐదు సంవత్సరాల వరకు సమయం పడుతుందనీ, కుష్టు వ్యాధి ఎవరికైనా రావచ్చుననీ, వ్యాధి రోగులు సామాజిక జీవితం గడపవచ్చునన్నారు. ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా అంగవైకల్యం నుంచి దూరం చేయవచ్చుననీ, ప్రజలందరూ గుర్తుంచుకోవాలని, ఎవరికైనా సహజ చర్మపు రంగు కంటే తక్కువ లేదా ఎరుపు రంగు రాయి రంగు కలిగిన మచ్చలు, మచ్చలపైన స్పర్శ ఉండదు, నొప్పి ఉండదు కావున ఆశ, ఆరోగ్య కార్యకర్తలకు చూయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జనరల్ సెక్రెటరీ మహేందర్, సత్యపాల్ రెడ్డి, రాజీవ్ నగర్ వైద్యాధికారీ, డిపిఎంవో రాఘవయ్య, సిహెచ్వోలు వెంకటేశ్వర్లు, నాందేవ్, డెమో బుక్క వెంకటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.