18-12-2025 05:29:04 PM
శ్రీ జగద్గురు శంకరాచార్యులు
మేడిపల్లి (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బోడుప్పల్ సర్కిల్ లోని శ్రీ మాతా నిమిషాంబ దేవి ఆలయం విస్తీర్ణంలో భాగంగా, అన్నదాన క్షేత్రం భవనానికి, శ్రీ జగద్గురు శంకరాచార్యులు, శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య సంస్థానాధీశ్వరులు, శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ, కరకమలమూలచే గురువారం నూతన ద్వారాల, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సనాతన ధర్మం కోసం పాటుపడాలని స్వామీజీలు భక్తులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కామ రౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు, కే అశోక్ కుమార్, ఎస్ శ్రీనివాస్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాసరావు, ట్రస్టు ధర్మకర్తలు బి వేమచంద్ ర్, డి నరసింగరావు, ఎం సాయిబాబా, వై చంద్రశేఖర్, ఎన్ శ్రీధర్, కె ప్రవీణ్ కుమార్, ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ, ఉమాకాంత్ శర్మ, భక్తులు, ఆలయ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.