18-12-2025 05:19:04 PM
నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): మండలంలోని గోపాల్పేట్ రైతు వేదికలో ఎరువుల దుకాణదారులకు, పిఏసిఎస్ సెక్రటరీలకు, సిబ్బందికి నూతనంగా అమలు చేయబోతున్న మొబైల్ ఫెర్టిలైజర్ బుకింగ్ అప్లికేషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయికిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు గోపి ఐఏఎస్ డీలర్స్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగిందని ఏవో సాయికిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దివ్య, బిటియం షఫీక్ ఉన్నారు.