18-12-2025 04:37:25 PM
అభివృద్ధి పనుల నిధుల మంజూరుపై ఒకరిపై ఒకరు ఆరోపణలు..
ఉప్పల్ (విజయక్రాంతి): అభివృద్ధి పనులు నిధులు మా పార్టీ నాయకుడు వల్లే మంజూరయ్యాయి అంటూ ఒక వర్గం.. లేదు మా ఎమ్మెల్యే చొరవతోనే మంజూరయ్యాయని మరో వర్గం ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గం రాజకీయం మరింత వేడెక్కుతుంది. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ విలేజ్ బాబా నగర్ సిసి రోడ్ల శంకుస్థాపనలో అధికారి పార్టీకి చెందిన నాయకులు కొబ్బరికాయలు కొట్టి ఉప్పల్ నియోజకవర్గం ఇన్చార్జి మంత్రులతో ఆయా శాఖ అధికారులతో మాట్లాడి మల్లాపూర్ డివిజన్ ను అభివృద్ధి చేస్తున్నారని ప్రకటించుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో దూసుకు వెళ్తుందంటూ కొన్ని పత్రిక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఇదే క్రమంలో శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించిన అనంతరం పరోక్షంగా మాటల ద్వారా చురకలాంటించడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంత్రులు తనకు సానిత్యం ఉందని అదే సానీత్యంతోనే మంత్రులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించుకొని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నానని తెలిపారు.
దీనిని కొంతమంది నాయకులు తామేదో గొప్పలు చేశామంటూ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం ఉందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే తన ధ్యేయంగా ముందుకు వెళుతున్నానని అన్ని ప్రజలు అని గమనిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తాను ఒక వైద్య మూలిక లాంటి వాడినని సర్వరోగ నివారణ లాగా సమస్యలను పరిష్కారం కోసం అందరికి ఉపయోగపడతారన్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల కోసం ఇప్పటి నుండే ఉప్పల్ నియోజకవర్గంలో నాయకుల సందడి మొదలైందని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో వేచి చేయాల్సిందే మరి.