17-05-2025 06:43:21 PM
చేగుంట/తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మండల పరిధిలోని పడాలపల్లి గ్రామ శివారులో పిడుగుపాటుకు ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరొకరికి గాయమైంది. పడాలపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్(15), యశ్వంత్(13) గ్రామంలో ఉన్నటువంటి కుంట వద్ద పిల్లలతో ఆడుకుంటుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చిన్నారులు చెట్టు కిందికి వెళ్ళగా, అప్పుడు చెట్టుపై పిడుగుపడడంతో చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.