calender_icon.png 29 December, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొఘలో ఇందిరమ్మ చీరల పంపిణీ

29-12-2025 06:09:22 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందజేయడం జరుగుతుందని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ తెలిపారు. డోంగ్లి మండలంలోని మోగా గ్రామంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు.

మహిళా సంఘాల సభ్యులకే కాకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించడం సంతోషకరమని తెలిపారు. మహిళా సంఘాల్లో చేరేలా మహిళలను ప్రోత్సహించాలని సూచించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు ఆదేశాల మేరకు మొఘ గ్రామంలో ఇందిరమ్మ చీరలు మద్నూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, మొఘ గ్రామ సర్పంచ్ బస్వంత్ హల్లే, ఉప సర్పంచ్ బాబు పటేల్, సంగ్రామ్ పటేల్, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.