29-12-2025 07:10:50 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): వితంతు మహిళలకు పెన్షన్ లు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిప్పల నర్సింగ్ రావు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ప్రతాప్ సింగారం, కొర్రె ముల, వెంకటాపురం, సాతెల్లిగూడెంలలో ఉన్న వితంతు మహిళల పెన్షన్ ల మంజూరి కోసం వితంతు మహిళలతో కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది.