calender_icon.png 29 December, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరుకుల్లా సమ్మక్క సారలమ్మ జాతర వేలం పాటలు

29-12-2025 06:15:10 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల గ్రామంలో వచ్చేనెల 28 నుండి నాలుగు రోజులపాటు జరుగు సమ్మక్క సారలమ్మ జాతర కు సంబంధించి సోమవారం పలు షాపులకు వేలంపాట, టెండర్లు నిర్వహించగా 5,14,332 ఆదాయం వచ్చిందని శ్రీ రంగనాయక స్వామి దేవాలయం ఈవో సాయి శంకర్ తెలిపారు, ఇందులో తలనీలాలు పోగుచేసుకొనుటకు రూ.82 వేలు, కొబ్బరికాయలు, బెల్లం అమ్ముకొనుటకు రూ.1,80,999, తల్లి ఆరాధన కోళ్లు  అమ్మకం కోసం రూ.1,80, 333, కొబ్బరి ముక్కలు ప్రోగు చేసుకొనుటకు  రూ.71,000 ఆదాయం వచ్చినట్లు ఈవో శంకర్ వివరించారు.