29-12-2025 07:14:14 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏ. శైలజ ను సర్కిల్ కార్యాలయంలో పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పీర్జాదిగూడ, మేడిపల్లి పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ ఏ.శైలజ సానుకూలంగా స్పందిస్తూ, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మేడిపల్లి కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.