16-12-2024 01:05:00 AM
కామారెడ్డి, డిసెంబర్ 15 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ప్రమాద బీమా రక్షణగా ఉంటుందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ఇటీవల మృతిచెందిన కార్యకర్తల కుటుం బాలకు ఆదివారం కామారెడ్డిలో రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మాచారెడ్డి జడ్పీటీసీ మీను కురి రాంరెడ్డి, నల్లవెల్లి అశోక్, శంకర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.