16-12-2024 01:05:15 AM
మైనర్‌ను వేధించిన కేసులో యువకుడి అరెస్ట్
ఎల్బీనగర్, డిసెంబర్ 15: మైనర్‌ను వేధించిన కేసులో ఓ యువకుడు నిందితుడు.. తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకొని దుబాయ్‌కి పారిపోయాడు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన అతన్ని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కృష్ణానగర్‌లోని పోలేపల్లికి చెందిన యలమల్ల సతీశ్(35) కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లోని మన్సూరాబాద్‌లో ఉంటున్న అక్క, బావ ఇంటికి వచ్చాడు. స్థానికంగా ఉన్న మైనర్‌ను ప్రేమ పేరుతో వేధించాడు. మైనర్ తల్లిదండ్రులు అక్టోబర్‌లో ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సతీశ్ వెంటనే దుబాయ్‌కి పారిపోయాడు. కాగా, వారం రోజుల క్రితం తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన సతీశ్‌ను ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం అదుపులో తీసుకొని, రిమాండ్‌కు తరలించారు.