22-11-2025 05:51:00 PM
గాంధారి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం గుర్జల్ తాండలో శనివారం కాంగ్రెస్ నాయకులు చెక్కులు పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గాంధారి మండల ఎంవైఎఫ్ అధ్యక్షులు బస్సీ నరేందర్, గుర్జల్ తండా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బామన్ జగదీష్ గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.