22-11-2025 05:29:30 PM
నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): మండలంలోని మండల సమైక్య కార్యాలయం నుండి ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, నిజాంసాగర్, లింగంపేట్, పిట్లం, బాన్సువాడ మండలాలలోని గ్రామాలకు మహిళా శక్తి చీరల పంపిణీ చేయడం జరిగిందని నాగిరెడ్డిపేట మండలం ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు. ఆరు మండలాలకు కలిపి మొత్తం 30 వేల,,104 చీరల పంపిణీ చేయడం జరిగిందన్నారు. నిజంసాగర్ మండలానికి 7560, పిట్లం మండలానికి 3840, ఎల్లారెడ్డి మండలానికి 5400, లింగంపేట్ మండలానికి 3000, బాన్సువాడ మండలానికి 2760, నాగిరెడ్డిపేట్ మండలానికి 7544, చొప్పున చీరల పంపిణీ చేయడం జరిగిందని ఏపీఎం రామనారాయణ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసి రమేష్, వివోఏలు సురేందర్, మల్లేష్, అకౌంటెంట్ రాజు ఉన్నారు.