22-11-2025 05:26:54 PM
42 శాతం సాదించేవరకు మా పోరాటం ఆగదు.
బిసి లంతా ఐకమత్యంతో ఉండాలి.
ముస్తాబాద్ జేఏసీ కన్వీనర్ తోట దర్మేందర్.
ముస్తాబాద్ (విజయక్రాంతి): 42 శాతం రిజర్వేషన్ల పోరాటానికి బీసీ సామాజిక వర్గాలు ఒక్కటి కావాల్సిన తరుణం ఆసన్నమైందని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల జేఏసి కన్వీనర్ తోట ధర్మేందర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా దర్మేందర్ మాట్లాడుతూ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు తిరిగి 23 శాతమే రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తూ జీవో విడుదల అయింది. ఈ తరుణంలో బీసీలందరూ ఒక్కటై ప్రభుత్వం ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల సాధనకు మరోసారి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు పేర్కొంటుండగా ఆ సంవత్సరం వరకు ఉన్న బీసీ జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే బీసీ ఉద్యమం తెలంగాణ అంతట లేకపోవడంతో ప్రభుత్వం కూడా బీసీల రిజర్వేషన్లకు అంతగా స్పందించనట్లు తెలుస్తోంది.
కావున బీసీ రిజర్వేషన్ల సాధనకు జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణను రూపొందించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే అంటే నోటిఫికేషన్ కు ముందే వారు హామీ ఇచ్చిన 42 శాతాన్ని అమలు చేయాలని బీసీ జేఏసీ పక్షాన కోరుతున్నామని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే బీసీలకు ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక చట్టసభల్లో బీసీలు కనబడే పరిస్థితి కనుచూపుమేరలో కనిపించదని తెలిపారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రిజర్వేషన్లతోనే సాధ్యమవుతాయని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామాన బీసీ విద్యార్థులు ,యువకులు, నిరుద్యోగులు, మహిళలను ఐక్యం చేసి రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చినప్పుడు బీసీ సంఘాలు అనుకున్న స్థాయిలో రిజర్వేషన్లు సాధించుకుంటారు. బేషాజాలకు పోకుండా బీసీ నాయకులందరూ ఒక్కటై ఐక్యంగా బీసీ రిజర్వేషన్ల సాధనకు నడవాలని తెలియజేశారు.