calender_icon.png 22 November, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

22-11-2025 05:44:15 PM

చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామి దాస్

వెంకటాపూర్(రామప్ప) (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామి దాస్ పేర్కొన్నారు. శనివారం జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాలను అనుసరించి, ములుగు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామి దాస్ పాల్గొని మాట్లాడారు.. పోక్సో చట్టం, విద్య హక్కు చట్టం, ర్యాగింగ్ చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, మోటార్ వెహికల్ చట్టాల గురించి వివరించారు. యువత మత్తుకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, ఉచిత న్యాయ సహాయానికి టోల్ ఫ్రీ నెంబర్ 15100 కి కాల్ చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎల్ చందర్, జూనియర్ లెక్చరర్స్ చరణ్, గోవర్ధన్, కిరణ్ కుమార్, సుస్మిత, లక్ష్మి నారాయణ విద్యార్థులు పాల్గొన్నారు.