22-11-2025 05:46:14 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం నూతన లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ ను రద్దు చేయాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసి నోటిఫికేషన్ ప్రతులు దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శిదుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ... కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు లాభాలు తెచ్చే విధంగా లేబర్ కోడ్స్ అమలుకు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఇది అత్యంత దుర్మార్గం, కార్మికుల మెడలకు ఉరితాళ్లుగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనికరపు అశోక్, మాజీ సీఐటీయూ నాయకులు చంద్రయ్య, హామలి సంఘం అధ్యక్షులు, రమేష్, రాజన్న, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.