కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణి
సదాశివనగర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసినట్లు తాసిల్దార్ ఆకుల సత్యనారాయణ తెలిపారు.78 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పెద్ద మొత్తంలో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశానుసారం పంపిణీ చేయడం జరిగిందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నల్ల మహిపాల్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సత్యనారాయణ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నల్లమహిపాల్ రెడ్డి, సిడిసి చైర్మన్ ఈర్షదోదిన్, ఏఎంసీ చైర్మన్ సంగ్యా నాయక్, మాజీ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు లింగ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గాదరి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు గణేష్ నాయక్, పిఎసిఎస్ చైర్మన్ సదాశివరెడ్డి, రూపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.






