6 August, 2026 | 7:09 PM

సీఎంసీ కార్యాలయంలో జయశంకర్ జయంతి వేడుకలు

06-08-2026 05:46 PM

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 93వ జయంతి సందర్భంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయంలో గురువారం ఘనమైన నివాళి కార్యక్రమం నిర్వహించారు. సీఎంసీ కమిషనర్ జి. శ్రీజన, ఐఏఎస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పాటుపడిన మహనీయుడి కృషిని గుర్తు చేసుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు సైద్ధాంతిక బలం అందించిన ఆయన సేవలు చిరస్మరణీయమని కమిషనర్ పేర్కొన్నారు.కార్యక్రమంలో సీఎంసీ వివిధ విభాగాల అధిపతులు,అధికారులు పాల్గొని నివాళులు అర్పించారు.తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన ఆచార్య జయశంకర్ ఆశయాలను కొనసాగించాలని అధికారులు అభిప్రాయపడ్డారు.