calender_icon.png 16 August, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదవాడి కడుపు నింపేందుకే రేషన్ కార్డులు

16-08-2025 07:58:39 PM

ప్రజల ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి ఉండాలి

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

వలిగొండ,(విజయక్రాంతి): పేదల కడుపు నింపేందుకే కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు అందిస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం వలిగొండ మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డు పత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయలేదని పేదల పక్షపాతి అయిన కాంగ్రెస్ పార్టీ పేదల కడుపు నింపేదికే నూతన రేషన్ కార్డులను, రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్పులను చేసిందన్నారు.

వలిగొండ మండలంలో దాదాపు 3,000 నూతన రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పాలనలో రేషన్ కార్డులను ఇందిరమ్మండ్లను అందించడం జరిగిందని, మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో వాటిని అందించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆశీస్సులు ఉండాలని ప్రభుత్వం మరింత ఉత్సాహంగా పనిచేస్తుందని అన్నారు. భువనగిరి నియోజకవర్గంలో సాగునీటి కాలువల కోసం 500 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, నూతనంగా వేలాది ఇందిర ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని ,నూతన రేషన్ కార్డులతో పేదల కండ్లల్లో, వారి ఇండ్లలో ఆనందం కనిపిస్తున్నది అన్నారు.