22-07-2025 08:16:51 PM
హనుమకొండ (విజయక్రాంతి): హసన్పర్తి మండల పరిధిలోని నాగారం పెద్ద చెరువు నుంచి అర్వపల్లి వరకు వెళ్లే పెద్ద కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కలను గ్రామస్తులు మంగళవారం తొలగించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద చెరువు నుంచి నీళ్లు రావడానికి గుర్రపు డెక్కలను తొలగించడానికి జేసీబీని సమకూర్చాలని స్థానిక ఎమ్మెల్యే నాగరాజు(MLA Nagaraju)ను కోరడంతో స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి జేసీబీని పంపించారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.