calender_icon.png 23 July, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా కార్మికుల గృహాలు కేటాయింపు

22-07-2025 08:50:39 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి ఉద్యోగుల గృహ కల్పన కోసం సింగరేణి యాజమాన్యం నిర్వహించిన గృహాల కేటాయింపు కౌన్సిలింగ్ పారదర్శకంగా నిర్వహించారు. పట్టణంలోని సీఈఆర్ క్లబ్లో మంగళవారం నిర్వహించిన కౌన్సిలింగ్ కు 100 గృహాలు ప్రకటించగా, 275 మంది కార్మికులు దరఖాస్తులు చేసుకున్నారని, సీనియారిటి ప్రాతిపదికన గృహాలు కేటాయించినట్లు ఏరియా ఎస్ఒటు జిఎం విజయ్ ప్రసాద్(GM Vijay Prasad) తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, ఎస్ఇ, ఐఇడి కిరణ్, సివిల్ ఎస్ఇ శ్రీధర్, సీనియర్ పిఓ కార్తీక్, రాజలింగులు (ఒ.ఎస్) పాల్గొన్నారు.