22-07-2025 08:05:21 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) దిల్వార్పూర్ మండలం లోలం గ్రామానికి చెందిన భీమన్న(35) అనే వ్యక్తి పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు నెలల క్రితం కూతురు పెళ్లి చేయగా.. గ్రామంలో ప్రైవేటు వారి వద్ద మూడు లక్షల వరకు అప్పు చేసినట్లు తెలిపారు. అయితే ఈసారి పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో అప్పు తీర్చలేమన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వివరించారు.