calender_icon.png 23 July, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు బోనాలు

22-07-2025 08:47:50 PM

హుజూర్ నగర్: తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు బోనాల పండుగ అని శ్రీ గురుకులం ప్రిన్సిపాల్ అనుముల ప్రియాంక అన్నారు. పట్టణంలోని శ్రీ గురుకులం పాఠశాల(Sri Gurukulam School)లో ఆషాడ మాసంలో శ్రీ గురుకులం బోనాలు పండుగ ఘనంగా నిర్వహించారు. విద్యార్ధిని, విద్యార్ధులు మన రాష్ట్రంలో రైతాంగానికి మేలు జరగాలని అత్యధికంగా వానలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అనుముల ప్రియాంక మాట్లాడుతూ.. తెలుగు పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని అందువల్ల మనం పండుగలను జరుపుకోవడం ఏంతో అవసరమని తెలిపారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.