calender_icon.png 23 July, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెట్టి చాకిరి కూలీలకు విముక్తి

22-07-2025 08:30:53 PM

పని చేయించుకుంటున్న 8 మంది నిందితులు అరెస్ట్..

నలుగురు పరార్..

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..

నల్గొండ టౌన్ (విజయక్రాంతి): మానవ అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరీ చేయిచుకుంటున్న ఏనిమిది మంది నిందితులను జిల్లా పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sharath Chandra Pawar) తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత కొంతకాలంగా కృష్ణ నది పరివాహక ప్రాంతంలో కొందరు చేపల వ్యాపారం చేసే వ్యక్తులు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిషా రాష్ట్రాల నుండి వ్యక్తులను అక్రమంగా రవాణా చేసుకొని వారితో వెట్టి చాకిరి చేయించుకుని ఎలాంటి జీతాలు ఇవ్వకుండా వాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు.

పని సమయ వేళలు పాటించకుండా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారితో చేపలు పట్టిస్తూ వెట్టి చాకిరి చేపించుకుంటున్న వ్యక్తుల చెరనుండి, దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో 32 కార్మికులు, 4 గురు బాలకార్మికులు, మొత్తం 36 మంది వెట్టిచాకిరి బాధితులను జిల్లా పోలీసు,రెవెన్యూ,చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులు సమన్వయంతో బృందాలుగా ఏర్పడి నది పరిపాక ప్రాంతంలోని వ్యక్తులను గుర్తించి రెస్క్యూ చేసి వెట్టి చాకిరి చేయించుకుంటున్న నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.

ఈ కేసులో మొత్తం 8  మంది నిందితులు పీఏ పల్లి మండలం బాణాలకుంట గ్రామానికి చెందిన వడ్త్య జవాహర్ లాల్, రామవత్ రమేష్, ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా బంగారం మపాలెం గ్రామానికి చెందిన మైలపల్లి శివ, కారే సింహా చలం, వంక ఇషాక్, అదేవిధంగా నల్లగొండ జిల్లా నేరేడు గోమ్మ మండలం వైజాగ్ కాలనీ చెందిన ఎరిపల్లి బాబుజీ, చాపల తాత రావు, చాపల బంగారిలు ఉండగా వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేయడం జరిగిందన్నారు. మిగతా నలుగురు పరారులో ఉన్నారని వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని త్వరలో అదుపులోకి తీసుకొనీ పూర్తి వివరాలు తెలపడం జరుగుతుందన్నారు. హైదరాబాద్, విజయవాడ, నుంచి వలస కార్మికులను తీసుకొచ్చి  మనిషికి 1500 చొప్పున ఇచ్చి ఉచితంగా ఆహారం ఇచ్చి మద్యం సరఫరా చేస్తామని మభ్యపెట్టి తెల్లవారు జామునా నదిలోకి చేపలు పట్టుటకు పంపేవారని తెలిపారు.

అలాగే చేపల వలలు లాగుటకు ఉపయోగించుకునేవారని.వీరికి రోజుకు రెండు పూటలా మాత్రమే  ఆహారం అందిచేవారని దీంతో పని బారం ఎక్కువ అయితుందని వారు చేసిన పనికి డబ్బులు ఇవ్వవలసిందిగా కోరగా డబ్బులు ఇవ్వకుండా వీరిని హింసిస్తూ వాతలు పెట్టేవారని తెలిపారు. ఎవరైనా వ్యక్తులను అక్రమ రవాణా చేసి వారిని బెదిరించి లేదా గాయపరిచి వారితో ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా సమయవేళలు పాటించకుండా పనులు చేయించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని  హెచ్చరించారు. ఈ కేసులు సేధించిన దేవరకొండ ఎఎస్పి మౌనిక, డిండి, కొండమల్లేపల్లి సిఐ లను గుడిపల్లి, నేరేడు గుమ్ము, గుర్రంపోడ్ ఎస్సైని రెవెన్యూ, చైల్డ్ కేర్, లైన్, సి డబ్ల్యూ సి బృందం ను నేరేడుగొమ్ము పోలీసు స్టేషన్ సిబ్బంది పి.మహేశ్, ఆర్.రాజు, వి.‌పి.ఓ ప్రశాంత్, వై.నరేందర్ రెడ్డి ల ను జిల్లా ఎస్పీ అభినందించారు.