22-07-2025 08:38:16 PM
మేడ్చల్ అర్బన్: ఎంబీఏ విద్యార్థులు వివిధ కార్పొరేట్ నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్(Indian Society for Training and Development) సహకారం అందిస్తుందని ఐ ఎస్ టి డి చైర్మన్ డాక్టర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం మేడ్చల్ కండ్లకోయలోని సీఎంఆర్ ఐటి కళాశాలలో ఎం.ఓ.యు ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. అనంతరం ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ యొక్క స్టూడెంట్ చాప్టర్ విడుదల చేశారు. ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఎంబీఏ విద్యార్థులకు వివిధ పరిశ్రమలతో నెట్వర్కింగ్ నిర్మించడానికి, ప్లేస్మెంట్లకు అవసరమైన సమకాలిన శిక్షణ సెషన్లను పొందడానికి ప్రయోజనం చేకూరుస్తుందని ఐ ఎస్ టి డి జాతీయ కౌన్సిల్ సభ్యురాలు డాక్టర్ కిరణ్మయి తెలిపారు. కార్యక్రమంలో సిఎంఆర్ కళాశాలల చైర్మన్ గోపాల్ రెడ్డి, సీఈఓ అభినవ్, కళాశాల హెచ్వోడి తదితరులు పాల్గొన్నారు.