22-07-2025 08:25:35 PM
నిధులు కేటాయించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రణపంగ కృష్ణ డిమాండ్..
పెన్ పహాడ్: ప్రజా పాలనలో గ్రామ పంచాయతీలు వీధి దీపాలు లేక అంధకారంలో మగ్గుతున్నాయని.. వెంటనే నిధులు కేటాయించి అంధకారంలో ఉన్న పల్లెలల్లో వెలుగులు నింపాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు రణపంగ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందని.. ఈ నేపథ్యంలో కార్యదర్శులకు ఇబ్బందులు తప్పడం లేదని తమ స్వంత ఖర్చు వెచ్చించి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయించాల్సి దుస్థితి నెలకొందన్నారు.
తాగు నీటి ఇబ్బందులు తలెత్తద్దని విద్యుత్ మోటార్లు, వీధి దీపాలు కాలిపోయినా.. మరమ్మతులు జరిపించాలంటే అందుకు అయ్యే ఖర్చు కార్యదర్శులే అప్పులు తెచ్చి గ్రామాలలో సేవలు చేస్తున్నారని అన్నారు. ఈ సమస్యలు తలెత్తినప్పుడు ఏలా చేస్తారో తెలియదు అని ఉన్నత అధికారులు కార్యదర్శులను బెదిరెంపులు గురిచేయడం.. వీరి ధీనగాధ కడుపు తరుక్కుపోతుందని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడొద్దని అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన కార్యదర్శులకు రావలసిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు వెంటనే విడుదల చేసి నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.