21-07-2025 07:03:26 PM
బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జిఎం రఘు కుమార్..
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి(Singareni)లో ప్రమాద రహిత బొగ్గు ఉత్పత్తికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జిఎం రఘుకుమార్, ఏరియా ఇన్చార్జి జిఎం విజయ్ ప్రసాద్ లు కోరారు. ఏరియాలోని జివిటిసిలో సోమవారం ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ కు నిర్వహించిన స్ట్రక్చర్ ట్రైనింగ్ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రమాద రహిత బొగ్గు ఉత్పతి, ఉత్పాదకతను సాధించడమే సింగరేణి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు. సంస్థ మునుగడకు సూపర్వైజర్ల పాత్ర కీలకమని వారు అన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని స్ట్రక్చర్ ట్రైనింగ్ కార్యక్రమంలో తమ యొక్క నైపుణ్యాలను మెరుగుపరచుకొని సంస్థ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. శిక్షణ కార్యక్రమాలతో ఉద్యోగుల వృత్తి నైపుణ్యత మెరుగుపడటమే కాకుండా, రక్షణ పెరుగుతుందని, తద్వారా సంస్థలో బొగ్గు ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుందన్నారు. శిక్షణ కాలంలో శిక్షకులు చెప్పే పూర్తి మెలకువలను నేర్చుకొని, సింగరేణి అభివృద్ధికి దోహదపడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భూ శంకరయ్య, ఏఐటీయూసీ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, జివిటిసి మేనేజర్ శంకర్, విటిసి శిక్షకులు అశోక్ కుమార్, సూపర్వైజర్లు పాల్గొన్నారు.