calender_icon.png 23 July, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి: తహసీల్దార్ సరిత

22-07-2025 08:14:11 PM

కోదాడ/నడిగూడెం: వర్షాకాలం ప్రారంభమైనందున మండలంలోని అన్ని డిపార్టుమెంట్లకు సంబంధించిన అధికారులందరూ మండలంలోని గ్రామాలలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తహసీల్దార్ సరిత(Tahsildar Sarita) కోరారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో అందుబాటులో ఉండి గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో మల్సూర్ నాయక్, ఎస్సై జి అజయ్ కుమార్, ఏవో దేవప్రసాద్, ఎంపీ ఓ విజయలక్ష్మి  వివిధ శాఖల మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.