calender_icon.png 26 July, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ హాస్టళ్లకు నాణ్యమైన బియ్యం పంపిణీ

24-07-2025 01:23:10 AM

- అల్యూమినియం బదులు స్టీల్ పాత్రలను వినియోగించాలి

- సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): రాష్ర్టంలోని అన్ని సంక్షేమ గురుకులాల్లో పౌర సరఫరాల శాఖతో సమన్వయం చేసి నాణ్యమైన ఫైన్ రకం బియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. వసతి గృహాల్లో ఇక నుంచి అల్యూమినియం పాత్రలకు బదులు స్టీల్ పాత్రల్లో  వంటలు చేయాలని, ఇందుకయ్యే ఖర్చుల అంచనా నివేదిక సమర్పించా లని మంత్రి అధికారులకు సూచించారు.

డైనింగ్ హాల్స్, మెస్‌లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని, వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా రాష్ర్టంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న జోనల్ అధికారులు, ప్రిన్సిపాళ్లతో హైదరాబాద్ ఎంసీసీఆర్‌హెచ్‌ఆర్డీ వేదికగా బుధవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పర్యావరణ అవగాహన పెంపొందించేందుకు టీజీఎస్‌డబ్ల్యూర్‌ఈఐఎస్  డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండి యాల మధ్య మిషన్ ప్రకృతిపై ఎంఓయూ కుదుర్చుకున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంస్థ చేపట్టిన అనేక వినూత్న కార్యక్రమాలను అభినందించారు. డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ నిర్వాహకులు అనిల్ కుమార్, శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అందుకోసం ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినాకి ఇప్పటికే సూచనలు చేసినట్టు చెప్పారు.

ప్రతి హాస్టల్‌కు 15 రోజులకొకసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి వైద్య బృందం వచ్చి విద్యార్థులకు  ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నా రు. ఉద్యోగుల సమస్యలను న్యాయపరంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రిన్సిపాళ్లకు  సర్వీస్ మ్యాటర్‌కు సంబంధిత అంశాలను నియమావళి మేరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు