calender_icon.png 27 July, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిఆర్‌సిని వెంటనే ప్రకటించాలి

26-07-2025 04:57:30 PM

పాపన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే పిఆర్సి ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(Telangana State United Teachers Federation) డిమాండ్ చేసింది. ఈ మేరకు మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం పాపన్నపేట మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కమిటీ సభ్యులు భీమ్లా, జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, భూషణం మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లో ఇస్తామన్నా పిఆర్సిని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని, రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే అన్ని చెల్లింపులు చేయాలని, జిపిఎఫ్, టి ఎస్ జి ఎల్ ఐ బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ నాయకులు  శ్రవణ్, నాయుడు, రఫీక్, పవన్ పాల్గొన్నారు.